Apr 23, 2012

మర్యాద రామన్న గారి కథలు .... మంచమ్మ - చెడ్దమ్మ

పిల్లలూ .. మర్యాద రామన్న గారనీ.. ఇదివరకటి రోజుల్లో ఒక తెలివైన గ్రామ పెద్ద ఉండేవారు. ఆయన తనదగ్గరికి సమస్యలతో వచ్చెవాళ్ళకి మంచి సలహాలు ఇవ్వటమే కాకుండా ... ఎటువంటి వ్యాజ్యాన్ని ఐన భలే తెలివితేటలతో , నిష్పక్షపాతం గా పరిష్కరించేవారు. ఈ క్రింద నేను చెప్పిన కథే దానికి ఒక నిదర్శనం.

ఈ కథలో వ్యాజ్యానికి వచ్చిన వాళ్ళు ఎటువంటివారో... ఒక చిన్న పరిక్షద్వార తెలుసుకుని.. భలేగా తీర్పు చెప్పారు .. మీరు కూడా వినేయండి మరి  :)

౧. నీటి ఆవస్యకతనీ, విలువనీ పిల్లలకి తెలియచెప్పండి.
౨. ఎక్కువ నీరు దుబారా చేసేవారు అప్పుల పాలు అవుతారు  - మా నాన్న చెప్పే వారు !
౩. నీరు ఒక సహజ వనరు అని తెలియజెప్పి .. నీటిని పొదుపుగా వాడుకునేలా ప్రోత్సహించండి

6 comments:

కొత్తావకాయ said...

చాలా రోజులకు మీ కథలు విందామని వచ్చానండీ! బోలెడు వినాల్సి ఉందన్నమాట!

మర్యాద రామన్న కథలు చెప్తున్నారా.. భేష్! ఆనక పంచతంత్రమూ, బాల రామాయణం, భాగవతం కథలూ, భారతం కథలూ కూడా మీ గొంతులో వినాలని ఉంది. :)

గ్రేట్ జాబ్! కీప్ గోయింగ్!

లక్ష్మీ శిరీష said...

కొత్తావకాయ గారు..." తమరి రాక మాకెంతో సంతోషం సుమండీ !" :) అన్ని చెప్పగలనో, లేదో చూడాలి మరి ! :) చాల ధన్యవాదాలండి! :)

కొత్తావకాయ said...

"చెప్పగలనో లేదో.." అంటారేమిటండీ! చెప్పాలి.. మేం వినాలి. ఆలోచించండి. :)

పూడూరి రాజిరెడ్డి said...

మీ గొంతు బాగుంది. చెబుతున్న తీరు బాగుంది.
కాకపోతే ఒక్కోచోట దీర్ఘవాక్యాలు ఉపయోగిస్తున్నారు. దాన్ని కొన్ని పొట్టి వాక్యాలుగా విడగొట్టడానికి ప్రయత్నించండి. ఈ కథ టైటిల్ మంచమ్మ చెడ్డమ్మ ఏంటండీ? అమ్మ అంటే బై డిఫాల్ట్ మంచమ్మే అయివుండాలి, ముఖ్యంగా పిల్లల కథల్లో. దానికి బదులు ఇద్దరికీ పేర్లు పెడితే సరిపోయేది. దీని ఒరిజినల్ టైటిల్ ధనవతి-గుణవతి అని ఏదో ఉన్నట్టు గుర్తు.
మంచి ప్రయత్నం చేస్తున్నందుకు మాత్రం అభినందనలు.

పూడూరి రాజిరెడ్డి గారు..... Thanks a lot for ur comments...
మంచమ్మ, చెడ్దమ్మ అనేవి వారి ఆలోచించే విధానం మరియు జీవన విధానం , నడవడిక లకి అనుగుణం గా పెట్టినవే కానీ ..అమ్మల్లో రకాలు అని కాదు! Its like Adjective.. నా ఉద్దేశ్యం లో !

కథ వింటే వారికి ఏది మంచి నడవడిక.. ఏది చెడు అని తెలుస్తుందని భావించాను. .... ఇది చిన్నప్పుడు ఎప్పుడో నేను టీవీ లో చూసిన కథ! నాకు కంటెంట్ గుర్తువుంది కానీ , పేర్లు అంతగా గుర్తు లేవు ....అందుకే అలా ఏదో create చేసాను... మా అబ్బాయి కుడా మంచమ్మ - చెడ్దమ్మకథ చెప్పమ్మా అని చాల సులభం గా అడుగుతాడు. అందుకే వేరే ఆలోచన చేయక ఏదో నా బుర్ర కి తోచినంతలో అలా అనేసాను..!