Apr 12, 2012

విజయమో ! అనుభవమో! ఏదో ఒకటి ...

మనం మన జీవితం లో రకరకాల సమయాల్లో రకరకాల పనులు చేయవలసి వస్తుంది .... ఒక్కక్క పని మనకి చాలా కొత్తగా వుంటుంది .. మొదట్లో ఆ పని చేయాలన్నా, అసలా  పని మొదలుపెట్టాలన్నాచాలా బెరుకుగా , భయం గా వుంటుంది. కొన్నిసార్లు మనం ఈ పని సరిగ్గా చేయకపోతే ప్రక్కవారు ఏమనుకుంటారో , మనల్ని చులకన చేసి  ఏడిపిస్తారేమో అని అసలు పని మొదలుపెట్టటానికే చాలా భయ పడుతూవుంటాం.... ఆ భయానికి లొంగిపోయి మనకిష్టమైన పనులు కూడా చేయకుండా వాయిదా వేయటమో .. మొత్తం గా మానివేయటమో జరుగుతుంది.

కానీ... ఒక్కసారి ఆ భయాలన్నీ ప్రక్కన పెట్టి , నూటికి నూరుశాతం ఏకాగ్రతతో ఆ పని చేస్తే .... 
ఐతే ...ఆ పనిలో "విజయం"  సాధిస్తాం... 
లేదూ .. కనీసం "అనుభవం" అయినా సంపాదిస్తాం.....
లేదూ ..  "కనీసం ..ప్రయత్నమైనా చేసాం! " అన్న ఆత్మ సంతృప్తి అయినా మిగులుతుంది ... మరి మీరేమంటారు ???

ఈ క్రింది కథ లో చిట్టి ఎలుక తనకి తెలియని ఒక కొత్త పనిని, తనదైన విధానం లో చేసి ... విజయం పొందటమే కాకుండా ఒక మంచి అనుభవం కుడా సంపాదించింది..అదెలాగో విందామా ??





మరి మీరు కూడా ఏదైనా ఒక క్రొత్త పని చేసేటప్పుడు.. ఫలితం గురించి ఆలోచించకుండా ... ధైర్యం గా చేస్తారు కదూ!! ??

4 comments:

జ్యోతిర్మయి said...

లక్ష్మీ శిరీష గారూ చాలా రోజులకు కనిపించారే.. చిట్టెలుకా...అమ్మమ్మ కథ భలే ఉందండీ..

లక్ష్మీ శిరీష said...

ఏదో పనిలో పడి update చేయలేదు :) ...Thank you Jyoti garu

జ్యోతిర్మయి said...

శిరీష గారూ నిన్న మా పిల్లలందరూ మీ కథ విని ఒకటే నవ్వుకున్నారండీ. మీరు దగ్గరుండి చూడాల్సింది ఎంత ఎంజాయ్ చేశారో...

లక్ష్మీ శిరీష said...

చాలా సంతోషం అండి :) మీరు నాకు ఈ విషయం తెలియచేసినందుకు ధన్యవాదాలు :) పిల్లలు ఎంజాయ్ చేయగలిగేలా చెప్పాలనే నా ప్రయత్నం..మీ కామెంట్ తో నన్ను పాస్ చేసారు ఈ పరీక్షలో :)