Feb 24, 2012

ఏనుగు - దర్జీవాడు

ఈ కథ మా అబ్బాయి కి చాలా ఇష్టం. వాడికి ఏనుగు  అంటేనే ప్రాణం. ఈ  "ఏనుగు -  దర్జీవాడు" కథ ఐతే  మా వాడికి లెక్కలేనన్నిసార్లు చెప్పివుంటాను :)  మా అబ్బాయిలాగా చాలామందికి  ఈ కథ నచ్చుతుందని ఈ ఆడియో రికార్డు  చేసాను. ఇంకెందుకు ఆలస్యం?? వినేయండి మరీ... :)




తల్లిదండ్రులకు సూచనలు :
-----------------------------
1. మీ పిల్లలకి ప్రతీ రాత్రి ఒక కథ ఐనా చెప్పటానికి ప్రయత్నించండి.
2. వీలైనంతగా వారు కథల పట్ల ఆకర్షితులయ్యేలా  చెప్పటానికి ప్రయత్నించండి.
3. విపరీతమైన కామెడి చేయండి వీలైనచొటల్లా.
4. పుస్తకాలతో అనుబంధం పేరిగేలా ప్రొత్సహించండి.

ఈ కథ కి సంబంధించిన సలహాలు :
---------------------------------------

1. నేను టిక్ -టిక్ అని చెప్పినచోట మీరు చూపుడు వేలు, మధ్యవేలుతో పిల్లల పొట్ట మీద / చేయి మీద నడుస్తున్నట్టుగా   అభినయించండి. పిల్లలు బాగా ఎంజొయ్ చేస్తారు :)
2. ఏనుగులా ఘీంకరించినప్పుడు - మీరు మీ చేయిని తొండం లాగ వూపండి.
3. దీవించింది అన్నప్పుడు - మీ చేయే తొండం కనుక  మీ చేతిని వారి తల మీద పెట్టి దీవించండి
4. చెరువులో నీళ్ళు తాగుతున్నప్పుడు : మీ తొండం తో  ( సారీ...  మీ చేతితో  :D ) నిజంగానే నీళ్ళు పీల్చుకుంటున్నట్లూ... స్నానం చేస్తున్నట్టూ...ఆఖర్న  పిల్లవాడి మీద కోపం గా /విసురుగా చల్లుతున్నట్టూ అభినయించండి. 

మీ పిల్లలు మళ్ళీ మళ్ళీ  ఈ కథ చెప్పమని మీ ప్రాణం తీయకపొతే నన్ను అడగండి :)



15 comments:

వనజ తాతినేని/VanajaTatineni said...

very nice.. Madam. Extra-ordinary creation. I like it.

లక్ష్మీ శిరీష said...

Thank you :) వనజవనమాలి gaaru

జ్యోతిర్మయి said...

మంచి ప్రయత్నం. కథ చక్కగా చెప్పారు. ధన్యవాదాలు.

లక్ష్మీ శిరీష said...

Thank u జ్యోతిర్మయి gaaru :)

lalithag said...

చాలా బాగా చెప్తున్నారు. మా పిల్లలకి తప్పకుండా వినిపిస్తాను. నేను ఆడియో కథల కోసం ఒక బ్లాగు మొదలు పెట్టాను. కానీ మీరు కథలు చెప్పే విధానం విన్నాక నేను చెప్పేది ఇంకా చాలా improve చేసుకోవాలని అర్థమయ్యింది. మీ కథలను పేరు చెప్పి అక్కడ కూడా ఉంచవచ్చా? ఆ బ్లాగు: http://balasahityam.wordpress.com మీ బ్లాగు లంకె నా వెబ్స్‌సైట్ (http://telugu4kids.com) లో ప్రస్తావిస్తాను. All the best for Kathasudha.

Anonymous said...

మీ కథ వింటే చిన్నపుడు రేడియోలో విన్న కథలు గుర్తుకు వచ్చాయి. మీ తెలుగు భాష ఉచ్చరణ, సందర్భాను సారం గా చేసిన మిమిక్రి, మాడ్యులేషన్,రికార్డింగ్ చాలా బాగా ఉంది. ఇంత చక్కగా కథలు చెప్తుంటే పెద్ద వారికే వినాలని ఉంది. పిల్లలు రెండోవ సారి, మూడవ సారి అడగటంలో ఆశ్చర్యమేమి లేదు. మొత్తానికి కథ చాలా చాలా బాగ చెప్పారు. 100/100 మార్క్ లు.

Regds
SriRam

సీత said...

very great work....go ahead.......

కొత్తావకాయ said...

తెలుగు కథ అంటే ఇలా ఉండాలి. ఇలా కథ చెప్తే పిల్లలు తెలుగు ఎంచక్కా నేర్చుకుంటారు. ఈ రోజుల్లో మీలా "హేళన, స్నేహం" ఇలాంటి పదాలు వాడే అమ్మలే లేరేమో అంటే అతిశయోక్తి కాదు. అభినందనలు.

చిన్న సలహా. వర్డ్ వెరిఫికేషన్ తీసేయండి. వ్యాఖ్యలు రాసేందుకు సులువుగా ఉంటుంది.

వేణూశ్రీకాంత్ said...

మీ బ్లాగ్ చాలాబాగుందండీ.. కథలు చెప్పే తీరు, మీ స్వరం చాలా హాయిగా ఉన్నాయ్.. చిన్నప్పుడు అమ్మదగ్గర విన్న కథలు గుర్తొస్తున్నాయ్. మీబ్లాగ్ నాకు పరిచయం చేసిన కొత్తావకాయ గారికి ధన్యవాదాలు.

శేఖర్ (Sekhar) said...

చాల చాల బాగుందండి మీ బ్లాగు.....పరిచయం చేసినందుకు కొత్తావకాయ గారికి ధన్యవాదాలు

లక్ష్మీ శిరీష said...

అందరికి ధన్యవాదాలు ! మీ లాటివారి అభిమానం నాకు ఉత్సాహాన్ని ఇస్తూనే బాధ్యతని పెంచుతోంది :) ఈ వీడియో లు అందరికీ ఉపయోగపడాలనేకానీ.. ఇతర ఉద్దేస్యాలతో చేసినవు కావు. మీకు నచ్చినందుకు కృతజ్ఞతలు :) ఇక పైన కుడా సాధ్యమైనంత బాగా చేయటానికి కృషి చేస్తాను :)

I am very sorry to say : naku lekhini lo type cheyatam kotha... chalaa time teesukuntondi... so naaku telugulo reply ivvalani vunna.... kudaratam ledu... tvaralo..nerchukuntaa ;)


@lalitha: నిస్సంకోచం గా మీరు నా కథాసుధ షేర్ చేసుకోవచ్చు. ఏ ఒక్కరికి ఈ కథలు వుపయోగపడినా నాకు సంతోషమే!

@anonymous: Tahnks andi... nannu manchi marks to PASS chesaru ;)

@kothaavakaaya: chalaa thx andi first of all.. for introducing my site and sending me a personal appreciation mail ! It means a lot to me! :)
వర్డ్ వెరిఫికేషన్ తీసేయండి annaru... nenu check chesi teesesthanu.

Once again Thank you all for ur valuable support and time!

పరుచూరి వంశీ కృష్ణ . said...

బాగుందండీ ! మీ వాయిస్ , మీరు చేసే టీక్ టీక్ సౌండ్స్ చాలా నచ్చాయి ..థాంక్స్ మంచి కధలు అందచేస్తున్నందుకు ...

పరుచూరి వంశీ కృష్ణ . said...

బాగుందండీ ! మీ వాయిస్ , మీరు చేసే టీక్ టీక్ సౌండ్స్ చాలా నచ్చాయి ..థాంక్స్ మంచి కధలు అందచేస్తున్నందుకు ...

కథా మంజరి said...

మీ అబ్బాయి అదృష్టవంతుడు. ఇంత చక్కగా కథలు చెప్పే అమ్మ దొరికి నందుకు. కథలు చెప్పడమే కాకుండా ఒక టీచర్ లాగా ఉపయుక్తమైన టిప్ లు కూడా బాగా ఇచ్చారు. మీరు టీచరయితే, గొప్ప టీచరు అయి ఉండే వారు.

లక్ష్మీ శిరీష said...

ధన్యవాదాలండి ... సీత గారు , వేణు శ్రీకాంత్గారు , శేఖర్ గారు , వంశి కృష్ణ గారు గారు మరియు జోగారావు గారు :)