Feb 22, 2012

ముందుగా నా మనసులో మాట !

నమస్తే! :-)
పిల్లల ప్రపంచం లో కథలకి వున్న ప్రాముఖ్యత అంతా,ఇంతా కాదు! కథలు వినోదాన్నిస్తూనే అంతర్లీనం గా పిల్లల్లో ఊహశక్తిని, విశ్లేషణ చేసే శక్తిని, సమయస్ఫూర్తిని, తెలివితేటలనీ పెంచుతాయి అని ప్రగాఢంగా నమ్ముతాను. అటువంటి కథలను నాకు తెలిసిన పధ్ధతిలో  - పిల్లలని ఆకట్టుకునేవిధం గా - సరదాగ చెప్పటానికి ప్రయత్నిస్తున్నాను.  ఈ కథలు మీకు గానీ, మీ పిల్లలకి గానీ కథల మీద ఏ మాత్రం ఇష్టాన్ని, ఆసక్తినీ కలిగించినా సంతోషిస్తాను. 
 
 నేటి ఇంటెర్నెట్ యుగంలొ  పిల్లలు కార్టూన్ లు చూడటనికి తద్వార దౄశ్య మాధ్యమానికి బాగా అలవటుపడిపొతున్నారు. ఏదైన వినటం ..అర్ధం చేసుకొవటం .. ఊహించుకోగలగటం వంటి మంచి అలవాటుని తెలియకుండానే కోల్పోతున్నారు. ప్రస్తుత సామాజిక పరిస్థితులలో అన్ని సమస్యల కి ముఖ్య కారణం పక్క వారి సమస్యలను సావధనం గా విని అర్ధం చేసుకోకపోవటమే!!

నా ఈ చిన్ని ప్రయత్నం పిల్లల్లొ యెంతో ముఖ్యమైన "వినటం" అనే ఒక మంచి అలవాటు చేస్తుందనీ  .....

అలాగే భార్యాభర్తలు ఇద్దరూ పని చేయవలసిన అవసరం యేర్పడిన ఈ రోజుల్లొ పిల్లలతో గడిపే సమయం ఎంత లేదన్నా కూడా బాగా తగ్గింది.ఉన్న కాస్త సమయం లో ఏ కధలు చెప్పాలి? ఎలా చెప్పాలి ? అని ఆలొచించే తల్లిదండ్రులు యెంతో మంది. అలాంటి వారికి ఈ సైటు యె కొంతైనా సాయం  చేయాలనీ ......

నేను విన్న కథలను, చదివిన కథలనూ నా తరహా లో చెప్పటానికి ప్రయత్నిస్తున్నాను. అలాగే నాకు తోచిన చిన్న,చిన్న సలహాలను తల్లిదండ్రులకు తెలియచేస్తాను. సహృదయం తో ఆదరిస్తారని ఆశిస్తూ...
 


ఈ బ్లాగు  ఆలోచనని నాకు కల్పించిన సాయి ( http://namanasucheppindi.blogspot.in ) గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.

4 comments:

Sai said...

శిరీష గారు.. ఇందులో నేను చేసిందేమీ లేదు...

ధ్యాంక్యూ... వెరీమచ్

Welcome to blogging...

Anonymous said...

మీనుంచి మంచి మంచి కధలు ఆసిస్తూ
బ్లాగులోకానికి స్వాగతం శిరీష గారు.

Rajasekharuni Vijay Sharma said...

తెలుగు బ్లాగు ప్రపంచానికి స్వాగతం.:)

కొత్తావకాయ said...

మంచి ఆలోచన. మీ స్వరం, కథ చెప్పే తీరు కూడా ఎంతో బాగున్నాయి. తరచూ కథలు చెప్తూ ఉండండి.